NDTV: అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌కు స్పందన అంతంతే!

దిల్లీ: న్యూదిల్లీ టీవీలో (NDTV)లో అదనపు వాటాల కొనుగోలు కోసం అదానీ గ్రూప్‌ (Adani group) చేపట్టిన ఓపెన్‌ ఆఫర్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. మంగళవారం ప్రారంభమైన ఈ ఓపెన్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 5తో ముగియనుంది. గురువారం సాయంత్రం 4 గంటల సమయానికి బీఎస్‌ఈ వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. 28 లక్షల షేర్లను వాటాదారులు విక్రయించారు.

NDTVలో 26 శాతం వాటాలకు సమానమైన 1.67 కోట్ల షేర్లను కొనుగోలు చేయాలన్న అదానీ గ్రూప్‌ ముందుకు రాగా.. ఇప్పటి వరకు 16 శాతం షేర్లు మాత్రమే విక్రయించారు. ఈ ఆఫర్‌లో భాగంగా ఒక్కో షేరును రూ.294కు కొనుగోలు చేయాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించింది. గురువారం ఎన్టీటీవీ షేరు విలువ రూ.368.40 వద్ద ముగిసింది. ఆఫర్‌ ధరతో పోలిస్తే ఇది 25.3 శాతం అధికం. దీంతో షేర్ల విక్రయానికి వాటాదారులు ఎంతమేర ముందుకొస్తారన్నది అనుమానమే.

ఎన్డీటీవీ ప్రమోటర్‌ కంపెనీ అయిన RRPR హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విశ్వప్రదాన్‌ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (VCPL) రూ.403.85 కోట్లు రుణం ఇచ్చింది. తర్వాతి కాలంలో VCPL యాజమాన్యం చేతులు మారి.. అదానీ గ్రూప్‌నకు చెందిన సంస్థ దాన్ని కొనుగోలు చేసింది. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. అప్పును 29.18 శాతం వాటాగా మార్చుకోవడంతో NDTVలో అదానీ గ్రూప్‌ వాటాలు పొందింది. దీనికి అదనంగా 26 శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌ పూర్తయితే ఎన్టీటీవీ అదానీ వశం అవుతుంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని