Malik: తెలుగులో ఫహద్‌ ఫాజిల్‌ ‘మాలిక్‌’.. ట్రైలర్‌ చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘మాలిక్‌’ (Malik). మహేశ్‌ నారాయణన్‌ దర్శకుడు. కరోనా కారణంగా గతేడాది ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ముఖ్యంగా రెండు భిన్న పార్శ్వాల్లో ఫహద్‌ ఫాజిల్‌ నటన సినిమాకే హైలైట్‌. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ఆహా’ వేదికగా ఆగస్టు 12వ తేదీ నుంచి ‘మాలిక్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. ఫహద్‌ ఫాజిల్‌తో పాటు నిమిషా సంజయన్‌, వినయ్‌ ఫోర్ట్‌, జోజూ జార్జ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను ‘ఆహా’ విడుదల చేసింది.



మరిన్ని

ap-districts
ts-districts