Chandramukhi 2:‘చంద్రముఖి-2’ షెడ్యూల్‌ పూర్తి

రాఘవ లారెన్స్‌ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం ‘చంద్రముఖి-2’. 2005లో విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందిన ‘చంద్రముఖి’కి సీక్వెల్‌ ఇది. తొలిభాగానికి దర్శకత్వం వహించిన పి.వాసునే ఈ రెండో భాగాన్నీ తెరకెక్కిస్తున్నారు. వడివేలు, రాధిక శరత్‌కుమార్‌ కీలక పాత్రలో  పోషిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ పూర్తైయినట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. దీనికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, ఛాయాగ్రహణం: ఆర్‌డీ రాజశేఖర్‌. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని