Vikram: ‘కోబ్రా’.. వచ్చేది ఆరోజే

విక్రమ్‌ హీరోగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కోబ్రా’. ఆర్‌.అజయ్‌ జ్ఞానముత్తు తెరకెక్కించారు. ఎస్‌.ఎస్‌.లలిత్‌ కుమార్‌ నిర్మాత. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ  విషయాన్ని చిత్ర బృందం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘వినూత్నమైన కథాంశంతో చక్కటి యాక్షన్‌ థ్రిల్లర్‌గా సినిమా ముస్తాబు చేశాం. ఇందులో విక్రమ్‌ గణితశాస్త్ర మేధావి పాత్రలో కనిపిస్తారు. భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలక పాత్ర పోషించారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. ఏఆర్‌   రెహమాన్‌ సంగీతమందించారు. హరీష్‌ కన్నన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని