Vijay Deverakonda: ప్రమోషన్స్‌కి చెప్పులేసుకెళ్లడానికి కారణమదే: విజయ్‌ దేవరకొండ

ముంబయి‌: ‘లైగర్‌’ (Liger) ప్రమోషన్స్‌కు చెప్పులేసుకెళ్లడంపై నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) స్పందించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసమే తాను చెప్పులేసుకెళ్తున్నట్లు చెప్పారు. ‘‘లైగర్‌’ తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుందనే నమ్మకం నాకు ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులందరికీ చేరువ చేయడానికి ఇంకా రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. ప్రతి రోజూ ఒక డ్రెస్‌, దానికి నప్పే షూల కోసం వెతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఈ చెప్పులు కొనుగోలు చేశా. దీని వల్ల నా డ్రెస్సింగ్‌కి ఎక్కువ సమయం పట్టడం లేదు. నేను చెప్పులేసుకుని ప్రమోషన్స్‌లో పాల్గొనడం వల్ల ఎవరైనా ఏమైనా అనుకున్నా నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తా’’ అని విజయ్‌ వివరించారు.

పూరీ జగన్నాథ్‌ - విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌ల్‌లో తెరకెక్కిన చిత్రమిది. విజయ్‌ నటించిన మొదటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో విజయ్‌.. నత్తితో ఇబ్బందిపడే యువకుడిగా కనిపించనున్నారు. అనన్యా పాండే కథానాయిక. మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించారు. ఆగస్టు 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరిన్ని

ap-districts
ts-districts