Poorna: పెళ్లి క్యాన్సిల్‌ వార్తలపై పూర్ణ ఏమన్నారంటే..!

ఒక్క ఫొటోతో అన్నింటికీ చెక్‌ పెట్టిన నటి

హైదరాబాద్‌: తన పెళ్లి క్యాన్సిల్‌ అయ్యిందంటూ వస్తోన్న వార్తలపై నటి పూర్ణ (Poorna) స్పందించారు. కాబోయే భర్తని కౌగిలించుకుని సిగ్గుపడుతోన్న ఓ ఫొటోని ఆమె తాజాగా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘‘అతడెప్పటికీ నా వాడే’’ అంటూ లవ్‌ సింబల్స్‌ను జోడించారు. పూర్ణ పెట్టిన పోస్టుతో ఆమె వివాహం రద్దైనట్లు వస్తోన్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లు అయ్యింది.

నటిగా తెలుగు వారికి చేరువైన పూర్ణ నిశ్చితార్థం యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ ఆలీతో ఈ ఏడాది జూన్‌లో జరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే.. నిశ్చితార్థమైన తర్వాత పూర్ణ, ఆమెకు కాబోయే భర్త షనీద్‌ మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో వీరు పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. తాజాగా పూర్ణ షేర్‌ చేసిన ఫొటోతో ఆ వార్తలకు చెక్‌ పడింది. ఇక, సినిమాల విషయానికి వస్తే..  ‘శ్రీమహాలక్ష్మి’, ‘అవును’, ‘సీమ టపాకాయ్‌’ వంటి చిత్రాలతో ఈ మలయాళీ భామ తెలుగువారికి చేరువయ్యారు. ప్రస్తుతం ఆమె పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts