Whistle: ‘విజిల్‌’ ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది.. రామ్,కృతిశెట్టిల డ్యాన్స్‌ అదిరింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌ పోతినేని (Ram Pothineni), కృతిశెట్టి (Krithi Shetty) జంటగా నటించిన చిత్రం ‘ది వారియర్‌’ (The Warrior). తమిళ దర్శకుడు లింగు స్వామి తెరకెక్కించిన ఈ సినిమా జులైలో విడుదలై సందడి చేసింది. ఆగస్టు 11 నుంచి ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో (Disney+ Hotstar) స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ‘విజిల్‌’ (Whistle) ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదలైంది. బీట్‌కు తగ్గట్టు నాయకానాయికలు చేసిన డ్యాన్స్‌ అందరినీ కట్టిపడేసేలా ఉంది. సాహితి రాసిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు. ఆంథోనీ దాసన్‌, శ్రీనిషా జయశీలన్‌ ఆలపించారు. ఫుల్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో రామ్‌.. సత్య అనే పోలీసు అధికారిగా నటించారు. గురు అనే విలన్‌ పాత్రలో ఆది పినిశెట్టి కనిపించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ‘బుల్లెట్టు’ ఫుల్‌ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లో అధిక వీక్షణలతో దూసుకెళ్తోంది.




మరిన్ని

ap-districts
ts-districts