Criminal Justice: ‘క్రిమినల్‌ జస్టిస్‌ 3’ వచ్చేస్తోంది.. ఉత్కంఠ భరిత ట్రైలర్‌ చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొంది, విశేష ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌ సిరీస్‌ ‘క్రిమినల్‌ జస్టిస్‌’. ఇప్పటికే రెండు సీజన్లతో అలరించిన ఈ సిరీస్‌ త్వరలోనే మూడో సీజన్‌తో (Criminal Justice Adhura Sach) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ విడుదలైంది. సాయం కావాలంటూ ఓ మహిళ.. న్యాయవాదికి విజ్ఞప్తి చేసే సన్నివేశంతో ప్రారంభమైందీ ట్రైలర్‌. ఓ బాల నటి హత్యకు గురికావడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిని పోలీసులు విచారించటం తదితర ఉత్కంఠ భరిత సన్నివేశాలు ఈ వీడియోలో ఉన్నాయి. అడ్వకేట్‌ మాధవ్‌ మిశ్రా పాత్రలో పంకజ్‌ త్రిపాఠీ కనిపించారు. శ్వేతాబసు ప్రసాద్‌, స్వస్తిక ముఖర్జీ, ఆదిత్యా గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. రోహన్‌ సిప్పీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో (Disney+ Hotstar) ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.



మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని