‘ఓం శ్రీ కనకదుర్గ’ ప్రారంభం

సుమంత్‌ శైలేంద్ర, మేఘ ఆకాష్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఓం శ్రీ కనకదుర్గ’. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. లంకా శశిధర్‌ దర్శకనిర్మాత. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్‌లో జరిగాయి. నాయకానాయికలపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అంబికాకృష్ణ క్లాప్‌నివ్వగా, డి.యస్‌.రావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. మురళీమెహన్‌, శైలేంద్రబాబు, గోపీ ఆచంట, దామోదర్‌ప్రసాద్‌, శ్రీధర్‌రెడ్డి, శివశక్తి దత్తా, నరసింహరాజు, డా.ప్రదీప్‌ జోషి తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రేమ, వినోదం, క్రైమ్‌, థ్రిల్‌ తదితర అంశాల మేళవింపుగా రూపొందుతున్న చిత్రమిది. కనకదుర్గగా వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటిస్తున్నారు. హైదరాబాద్‌, విజయవాడ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం’’ అన్నారు. డి.యస్‌.రావు మాట్లాడుతూ ‘‘మంచి కాన్సెప్ట్‌తో చిత్రం రూపొందుతోంది.

బ్రాండ్‌ బాబు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్‌ శైలేంద్రకి, దర్శక నిర్మాతలకి పేరుతో పాటు లాభం తీసుకొచ్చే చిత్రం అవుతుంది’’ అన్నారు. ఛాయాగ్రహణం: శ్రీచిత్‌ విజయన్‌ దామోదర్‌, సంభాషణలు: హర శ్రీనివాస్‌, కథ, స్క్రీన్‌ప్లే: నరేష్‌ అమరనేని, సమర్పణ: లంకా ఫణిధర్‌.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని