కళాశాలలో ప్రేమ

త్రిగుణ్‌, మేఘ ఆకాష్‌ జంటగా శ్రీకాంత్‌ సిద్ధమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమదేశం’. శిరీష సిద్ధమ్‌ నిర్మాత. మధుబాల ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. సెప్టెంబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపాయి సినీ వర్గాలు. ‘‘కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. 1996లో విడుదలైన ‘ప్రేమదేశం’ పేరుతో ఇప్పుడొస్తున్న మా సినిమాకి మణిశర్మ స్వరకర్త. ఆయన సమకూర్చిన పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధానబలం. మధుబాల, తనికెళ్ల భరణి తదితర సీనియర్‌ నటుల పాత్రలు ఇందులో కీలకం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ’’ని దర్శకనిర్మాతలు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని