Vijay Antony: ఇండియన్‌ సెలబ్రిటీ మోడల్‌ ‘లైలా’ హత్య! చేసిందెవరు?

హైదరాబాద్‌: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్‌ ఆంటోని (vijay antony). ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతూ ఉంటుంది. తాజాగా బాలాజీ కె.కుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని నటించిన తమిళ చిత్రం ‘కోలాయ్‌’. తెలుగులో ‘హత్య’ (Hatya) పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. లైలా అనే ఇండియన్‌ సెలబ్రిటీ మోడల్‌ హత్యకు గురవుతుంది. ఆ హత్య కేసును విజయ్‌ ఆంటోని, అతని బృందం ఎలా ఛేదించింది?వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే అంశాల చుట్టూ ఉత్కంఠగా కథను అల్లుకున్నాడు దర్శకుడు బాలాజీ. మరి ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? చూసింది ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!



మరిన్ని

ap-districts
ts-districts