Manchu Vishnu: ‘మా’ మీటింగ్‌.. ఫొటో షేర్‌ చేసిన విష్ణు

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) (MAA) కార్యనిర్వహక కమిటీ బుధవారం ఉదయం సమావేశమైంది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పాలనలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై వీరంతా చర్చించారు. అలాగే ‘మా’ సభ్యుల సంక్షేమం, వారికి సినిమాల్లో అవకాశాలు కల్పించడం వంటి నిర్ణయాలపై మాట్లడుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు ఓ ట్వీట్‌ పెట్టారు. ‘‘మా’ కార్యనిర్వాహక వర్గ సమావేశం మరొకటి పూర్తైంది. ఇలాంటి శ్రద్ధ, పట్టుదల గల బృందంతో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ‘మా’ అభివృద్ధికి తోడ్పడేలా మేము ప్రవేశపెట్టే సంస్కరణలు అసాధారణమైనవి’’ అని విష్ణు పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts