Reyiki Veyi Kallu: ఊహకందని మలుపులతో ‘రేయికి వేయి కళ్లు’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: లవ్‌, సస్పెన్స్‌, మిస్టరీ నేపథ్యంలో రూపొంది, తమిళనాట మంచి విజయం అందుకున్న చిత్రం ‘ఇరువక్కు ఆయిరమ్‌ కంగళ్‌’ (Iravukku Aayiram Kangal). అక్కడి థియేటర్లలో 50 రోజులకుపైగా ప్రదర్శితమై, ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన ఈ సినిమా ‘రేయికి వేయి కళ్లు’ (reiki veyi kallu) పేరుతో తెలుగులోకి డబ్‌ అయింది. ఓటీటీ ‘ఆహా’లో సెప్టెంబరు 30 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ సినిమా తెలుగువారికీ థ్రిల్ పంచుతోంది. మర్డర్‌ మిస్టరీని ఛేదించే క్రమంలో ఎదురయ్యే మలుపులు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఇందులో ఓ అందమైన లవ్‌స్టోరీ కూడా ఉంది. ఎంతో సరదాగా సాగే క్యాబ్‌ డ్రైవర్‌ అయిన హీరో జీవితంలో ఊహించని ఘటన ఎదురవుతుంది. హత్య కేసులో ఇరుక్కున్న ఆ హీరో ఎలా బయటపడ్డాడు? అనే ఆసక్తికర అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో అరుళ్‌నిధి ప్రధాన పాత్రధారి. అజ్మల్‌, మహిమా నంబియార్‌, విద్యా ప్రదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిన్న పాయింట్‌ను రివర్స్‌ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించి దర్శకుడిగా తన సత్తా చాటారు మారన్‌.



మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని