
Rashmika: ఉలిక్కిపడి లేచేదాన్ని..రాత్రంతా ఏడ్చేదాన్ని..: రష్మిక
ఇంటర్నెట్ డెస్క్: ముద్దుగుమ్మ రష్మిక చేతి నిండా సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది. తన తదుపరి చిత్రం ‘గుడ్‌బై’ ప్రమోషన్స్‌లో తీరిక లేకుండా గడుపుతోంది. తన అందంతో అభినయంతో అందరినీ ఆకట్టుకునే ఈ హీరోయిన్ 2019లో విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ సినిమాలోని లిప్‌లాక్ సీన్లో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి చెప్పింది. ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నేను ఆ రోజులను, ఆ సీన్‌పై వస్తున్న ట్రోల్స్‌ను ఎలా అధిగమించానో నాకే తెలియదు. నేను చాలా సున్నిత మనస్కురాలిని. కొంతమంది నాకు ఫోన్ చేసి అంతా బాగానే ఉంది అని చెప్పేవాళ్లు. కానీ, కొందరు నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. ఆ టైమ్‌లో నన్ను బాధించే ఘటనలు చాలా జరిగాయి. నేను ఎవరినో వేడుకుంటున్నట్లు కలలు వచ్చేవి. అందరూ నన్ను వెలివేసినట్లు కూడా కలలు వచ్చేవి. అలాంటి కలలు వచ్చినప్పుడు ఉలిక్కిపడి నిద్ర లేచి ఏడ్చేదాన్ని. అలా రాత్రంత్రా ఏడుస్తూ ఉండేదాన్ని’’అని తన చేదు అనుభూతుల గురించి చెప్పింది రష్మిక.
ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఆమె నటించిన ‘గుడ్‌బై’ సినిమా అక్టోబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రంతో రష్మిక బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయనుంది. వీటితో పాటు సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’లో, రణబీర్ కపూర్ సరసన ‘యానిమల్’ చిత్రాల్లో నటిస్తోంది.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు