పాటల సందడి

ఆకట్టుకుంటోన్న బేబీ..

సినిమాల్ని ప్రేక్షకులకు చేరువ చేయడంలో పాటలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమా ఏదైనా సరే, అందులోని పాటల్ని మొదట ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు దర్శకనిర్మాతలు. తరచూ సామాజిక మాధ్యమాల్లో పాటలు విడుదలై సందడి చేస్తుంటాయంటే కారణం అదే. తాజాగా ‘లెహరాయి’ సినిమాలోని ‘బేబీ...’ అంటూ సాగే ఓ పాట విడుదలైంది. రంజిత్‌, సౌమ్య మేనన్‌ జంటగా, రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మద్దిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మాత. దీన్ని కాసర్ల శ్యామ్‌ రచించగా, సాకేత్‌, కీర్తనశర్మ ఆలపించారు. ఘంటాడి కృష్ణ స్వరకర్త. బెక్కం వేణుగోపాల్‌ సమర్పిస్తున్నారు.


లలనా... మధుర కలనా...

భిరామ్‌ వర్మ, సాత్వికారాజ్‌ జంటగా బాలు శర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నీతో’. బాలుశర్మ దర్శకత్వం వహించారు. ఏవీఆర్‌ స్వామి, కీర్తన, స్నేహల్‌ నిర్మాతలు. ‘లలనా...  మధుర కలనా..’ అంటూ సాగే ఈ పాట వీడియోని సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. వివేక్‌సాగర్‌ స్వరకర్త. ప్రేమకథతో రూపొందిన ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపాయి చిత్రవర్గాలు.


మరిన్ని