
‘రుద్రంగి’ నాదే..
ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘రుద్రంగి’. జగపతిబాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహన్‌దాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్ సామ్రాట్ దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ని సోమవారం విడుదల చేశారు. భీమ్రామ్ దొర పాత్రలో ‘రుద్రంగి నాది, రుద్రంగి బిలాంగ్స్ టూ మీ’ అంటూ సందడి చేశారు జగపతిబాబు. ‘‘కథాబలం ఉన్న చిత్రమిది. అజయ్ సామ్రాట్ ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. ప్రచార చిత్రాలకి చక్కటి స్పందన లభిస్తోంది’’ అన్నాయి సినీవర్గాలు.
‘విక్రమ్’ ఘనత
కమల్‌హాసన్ కథానాయకుడిగా నటించిన ‘విక్రమ్’ బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రతిష్ఠాత్మక బుసాన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానుంది. ఈ విషయాన్ని సినీవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ ఉత్సవాలు ఈనెల 5 నుంచి 14 వరకు జరుగుతాయి. ఓపెన్ సినిమా కేటగిరీ విభాగంలో ప్రదర్శితం కానుంది. దీనికి లోకేశ్ కనగరాజ్ దర్శకుడు.
కేసుని ఛేదించింది ఎవరు?
ఒక అర్జున్ మొదలుపెట్టిన కేసు కోసం మరో అర్జున్ రంగంలోకి దిగాడు. అతడా కేసుని ఎలా పరిష్కారించాడు? ఇంతకీ మొదటి అర్జున్ ఏమయ్యాడు? ఇవన్నీ తెలియాలంటే ‘హంట్’ చూడాల్సిందే. సుధీర్‌బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రమిది. మహేష్ దర్శకుడు. శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ ప్రధాన పాత్రధారులు. వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మాత. ఈ సినిమా టీజర్ సోమవారం విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని స్పృశిస్తూ రూపొందించిన పోలీస్ థ్రిల్లర్ చిత్రమిది. మాకు లభిస్తున్న స్పందన సంతోషాన్నిస్తోంది. అర్జున్‌ప్రసాద్ పాత్ర కోసం సుధీర్ చాలా కష్టపడ్డారు. కొన్ని పోరాట ఘట్టాల్ని ఫ్రాన్స్‌లో తెరకెక్కించాం’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇదొక స్టైలిష్ యాక్షన్ చిత్రం. కేసు ఛేదనలో పోలీస్ అర్జున్‌ప్రసాద్ సాగించిన వేట ఆసక్తికరం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. సంగీతం: జిబ్రాన్, ఛాయాగ్రహణం: అరుల్ విన్సెంట్.
సీతారామపురంలో ఓ ప్రేమజంట
రణధీర్, నందిని జంటగా వినయ్ బాబు తెరకెక్కించిన చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. బీసు చందర్‌గౌడ్ నిర్మాత. సుమన్, సూర్య, అమిత్ తివారీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను నిర్మాత దిల్‌రాజు ఇటీవల విడుదల చేశారు. ‘‘టైటిల్ చాలా బాగుంది. నాయకానాయికల జంట చూడముచ్చటగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడి ప్రతిభ ఏంటో అర్థమైంది. ఈ చిత్రం విజయం సాధించి.. సినీ బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘నిజాయతీగా ప్రేమించుకున్న ప్రతి యువతీయువకుడు చూడాల్సిన చిత్రమిద’’న్నారు దర్శకుడు వినయ్. సంగీతం: ఎస్.ఎస్.నివాస్, ఛాయాగ్రహణం: విజయ్ కుమార్.
ఉత్కంఠభరితంగా సాగే ‘రోరి’
చరణ్ రోరి హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రోరి’. కరిష్మా కథానాయిక. కోటా శ్రీనివాసరావు, జయప్రకాష్, దేవిప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చరణ్ రోరి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఓ కుర్రాడి కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో ఆ కుర్రాడు పాకిస్థాన్ వెళ్లాల్సి వస్తుంది. అతను అక్కడ కొంతమంది హిందువుల్ని కలుస్తాడు. వారితో కలిసి భారత్‌కు క్షేమంగా తిరిగి వచ్చాడా? లేదా? అసలు హైదరాబాద్, పాకిస్థాన్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నవి ఆసక్తికర అంశాలు’’ అన్నారు. సంగీతం: భీమ్స్, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర.
‘నవాబ్’ ఎవరు?
ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్న చిత్రం ‘నవాబ్’. రవిచరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.ఎం. నిర్మాత. నవాబ్ పాత్రని పరిచయం చేస్తూ చిత్రబృందం తాజాగా విలేకర్ల సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘చెత్త గుమ్మరించే ఓ ప్రదేశం నేపథ్యంలో సాగే కథ ఇది. 12 ఎకరాల్లో డంపింగ్ యార్డ్‌ని సృష్టించి చిత్రీకరణ చేశాం. మా కథలో నవాబ్ ఎవరు? అతనేం చేశాడన్నది ఆసక్తికరం’ అ’న్నారు. ‘‘సినిమా వైవిధ్యంగా, ప్రేక్షకులకు కొత్త రకమైన అనుభూతి పంచేలా ఉంటుంద’’న్నారు హీరో. కార్యక్రమంలో రామరాజ్, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు
-
Crime News
Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
-
Ap-top-news News
Andhra News: నారాయణ.. వాలంటీర్ ఇవన్నీ విద్యార్హతలేనట!
-
Ap-top-news News
AP High Court: అభ్యంతరముంటే ‘బిగ్‌బాస్’ చూడొద్దు: హైకోర్టు
-
General News
Tirumala: వైభవంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై శ్రీవారి దర్శనం