RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ ఆనందం

భారతీయ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) అంతర్జాతీయంగా ఇంకా ఆకట్టుకుంటూనే ఉంది. అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌లో ఒక థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌కి ప్రేక్షకులు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. అంతర్జాలంలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ స్పందనని చూసి మురిసిపోయారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. తనపట్ల, తన హీరోలపట్ల చూపించిన ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ, అక్కడి ప్రదర్శనకి సంబంధించిన వీడియోని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. అది చూసి కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ స్పందించారు. ‘ఈ ప్రశంసలకు మీరు అర్హులు. ఇవే కావు.. మీకు ఇంకా ఎంతో రావాల్సి ఉంది జక్కన్నా’ అంటూ సోమవారం ట్వీట్‌ చేశారు.


మరిన్ని