
Kajal: సూర్య, జ్యోతికలకు అభినందనలు చెప్పిన కాజల్..!
ఇంటర్నెట్ డెస్క్: సూర్య నటించిన సూరారై పోట్రు( ఆకాశం నీ హద్దురా) సినిమా జాతీయ చలన చిత్ర అవార్డుల్లో 5 అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సూర్య కుటుంబ సమేతంగా హాజరై ఉత్తమ నటుడు అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చందమామ భామ కాజల్ ట్విటర్ వేదికగా సూర్య, జ్యోతికలకు అభినందనలు తెలిపింది. ‘‘జాతీయ అవార్డు అందుకున్నందుకు మీకు అభినందనలు. మీరు ఆ అవార్డు అందుకోడానికి అర్హులు’ అంటూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది
కెప్టెన్ గోపీనాథ్ జీవితాధారంగా రూపొందిన చిత్రమే సూరారై పోట్రు. దీనిని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే పేరుతో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రశంసలే కాకుండా అవార్డుల పంట పండింది. ఏకంగా 5 జాతీయ అవార్డులను ఈ చిత్రం తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ నటుడు(సూర్య), ఉత్తమ నటి (అపర్ణ)తో పాటు ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ స్ర్కీన్‌ప్లే కుగాను అవార్డులు వచ్చాయి. ఇక ఈ చిత్రం హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం