
Hema: ‘భక్తితో వచ్చా.. కాంట్రవర్సీ కోసం కాదు’ : హేమ
విజయవాడ: నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లిన నటి హేమ (Hema) ఓ విలేకరి పట్ల అసహనానికి గురయ్యారు. తాను భక్తితో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చానని.. కాంట్రవర్సీల కోసం రాలేదంటూ ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. సోమవారం సాయంత్రం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం హేమ మాట్లాడారు..‘‘దుర్గమ్మ అలంకరణలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని వార్తల్లో చూశా. ఈ ఏడాది అమ్మవారిని దర్శనం చేసుకోలేనేమోనని కంగారుపడ్డా. కానీ, ఆ దేవి దయ వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చాను’’ అని ఆమె పేర్కొన్నారు.
అనంతరం మీడియా పాయింట్ నుంచి ఆమె బయలుదేరుతుండగా ఓ విలేకరి.. ‘‘మేడమ్ మీరు ఎంతమంది వచ్చారు? ఏ టిక్కెట్ కొనుగోలు చేశారు?’’ అని ప్రశ్నించాడు. విలేకరి ప్రశ్నతో హేమ ఒకింత అసహనానికి గురయ్యారు. ‘‘మేము ఇద్దరం వచ్చాం. ప్రొటోకాల్ ప్రకారమే టిక్కెట్ కొనుగోలు చేసి... అమ్మవారి దర్శనం చేసుకున్నాం. నేను గుడిలో రూ.10 వేలు కానుకగా ఇచ్చాను. రూ.20 వేలు పెట్టి చీర కొని అమ్మవారికి సమర్పించాను. ఎందుకు వివాదాన్ని సృష్టిస్తున్నారు ’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం