Nikhil: ఆయన ఇంటర్వ్యూలు కచ్చితంగా చూస్తాను..: నిఖిల్‌

హైదరాబాద్‌: ‘కార్తికేయ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్‌. తాజాగా ‘కార్తికేయ-2’ సినిమాతో ప్రేక్షకులను పలకరించి అలరించారు. ఈ యంగ్‌ హీరో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు పెద్ద అభిమాని కావడం విశేషం. ‘షారుక్‌ సినిమాలు ఎన్నిసార్లు చూశానో లెక్కలేదంటూ’ ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో నిఖిల్‌ వెల్లడించారు.

‘‘నేను షారుక్‌ ఖాన్‌కు పెద్ద అభిమానిని ఆయన ప్రతి సినిమాని తప్పకుండా చూస్తా. ఇక టి.విలో వచ్చే ఇంటర్వ్యూలు చాలా సార్లు చూశా. టెలివిజన్‌ షోలు ఎన్నిసార్లు చూసి ఉంటానో లెక్కేలేదు. షారుక్‌ను కొన్ని లక్షల మంది అభిమానిస్తారు. ఆయన బాలీవుడ్‌కు కింగ్‌గా ఎదిగిన తీరు అద్భుతం. ఆయన నాలో స్ఫూర్తిని నింపారు’’ అంటూ షారుక్‌ పై తనకున్న అభిమానాన్ని నిఖిల్‌ తెలియజేశాడు.

ప్రస్తుతం నిఖిల్‌ ‘కార్తికేయ2’ విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌5 నుంచి జీ5 వేదికగా డిజిటల్‌ ప్రేక్షకులను అలరించనుంది. త్వరలోనే  ఈ యంగ్‌ హీరో యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘స్పై’గా రానున్నాడు.


మరిన్ని

ap-districts
ts-districts