DSP: దేవీ శ్రీ ప్రసాద్‌ హిందీ సాంగ్‌ లాంఛ్‌ చేసిన బాలీవుడ్‌ హీరో...!

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో మాస్‌ అయినా, మెలొడీ అయినా.. దేశీ అయినా, వెస్ట్రన్‌ అయినా.. స్లో సాంగ్‌ అయినా.. ఐటెమ్‌ సాంగ్‌ అయినా అలవోకగా కంపోజ్‌ జేసి కుర్రకారును ఉర్రూతలూగిస్తారు దేవీశ్రీప్రసాద్‌. సంగీత ప్రియులు డీఎస్పీ అని పిలుచుకునే ఈ సంగీత దర్శకుడు ఇటీవల హిందీలో ఓ అల్బమ్‌ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ సంగీత దిగ్గజం భూషణ్‌ కుమార్‌తో కలిసి ‘ఓ పరీ’ అనే ట్రాక్‌తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ఈ పాటను బాలీవుడ్‌ ప్రముఖ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ లాంఛ్‌ చేశారు. ఈ విషయాన్ని దేవీ శ్రీ ప్రసాద్‌ ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘బాలీవుడ్‌లో నా తొలి పాటను లాంఛ్‌ చేసినందుకు రణ్‌వీర్‌ సింగ్‌కు ధన్యవాదాలు. మీరు నాతో కలిసి స్టేజీపై పాట పాడి డాన్స్ వేసినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నా. మీ  ఎనర్జీ లెవెల్స్ అద్భుతం’’ అంటూ రణ్‌ వీర్‌ను ట్యాగ్‌ చేశారు. తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలలో దేవీ శ్రీ ప్రసాద్‌ తన ఐటెమ్స్‌ సాంగ్స్‌తో అలరిస్తారు. పుష్ప సినిమాలో ఇటీవల ఈ రాక్‌స్టార్‌ కంపోజ్‌ చేసిన శ్రీవల్లి పాట సోషల్‌ మీడియాను హోరెత్తించిన విషయం తెలిసిందే.మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని