Boy friend For Hire: నవ్వులు పూయిస్తున్న ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్’ ట్రైలర్‌..!

హైదరాబాద్‌: విశ్వాంత్‌, మాళవిక జంటగా సంతోష్‌ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రబృందం ఈ రోజు విడుదల చేసింది. అమ్మాయిలను చూస్తే భయపడే అబ్బాయిగా విశ్వాంత్‌ నటన, ట్రైలర్‌లోని కొన్ని డైలాగ్‌లు నవ్వులు పూయిస్తున్నాయి. స్వస్తిక సినిమా, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌ మెంట్‌ బ్యానర్స్‌పై వేణుమాధవ్‌ పెద్ది, కె. నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గోపి సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. షూటింగ్‌పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్‌14న థియేటర్లలో విడుదలవ్వనుంది. మరెందుకు ఆలస్యం ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’  ట్రైలర్‌ మీరు చూసేయండి.



మరిన్ని

ap-districts
ts-districts