
Allari Naresh: ఆ సినిమాతో నా రేంజ్ పెరిగిపోతుందనుకున్నా కానీ: నరేశ్
హైదరాబాద్: తాము నటించిన కొన్ని సినిమాలపై నటులకు ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఫలానా చిత్రం ఘన విజయం అందుకుంటుందని, దాంతో వాళ్ల కెరీర్ మారిపోతుందనుకుంటారు. కానీ, ఒక్కోసారి పరిస్థితులు తారుమారవుతాయి. ఇలా తనకు ఎదురైన అనుభవాన్ని అల్లరి నరేశ్ (Allari Naresh) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన కొత్త చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam) ప్రచారంలో భాగంగా నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
‘‘నేను’ అనే సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఆ చిత్రం విడుదలయ్యాక నా రేంజ్ పెరిగిపోతుందనుకున్నా. అంతగా ఈ సినిమాని నమ్మా. అది ఆశించనంత ఫలితాన్ని ఇవ్వకపోయినా మంచి జ్ఞాపకాలను మాత్రం మిగిల్చింది. ఆ సినిమా వల్లే నాకు ‘గమ్యం’లో మంచి పాత్ర లభించింది. దీనివల్ల ‘శంభో శివ శంభో’, ఈ మూవీ వల్ల ‘మహర్షి’లో నటించే అవకాశం దక్కింది. ఇందులోని సీరియస్ క్యారెక్టర్‌ను పోషించడం వల్ల ‘నాంది’ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది’’ అని నరేశ్ తెలిపారు. అభివృద్ధికి దూరంగా ఉండే గిరిజన ప్రాంతాల సమస్యలను ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ద్వారా తెరపైకి తీసుకురానున్నారు దర్శకుడు ఎ. ఆర్. మోహన్. ఈ సినిమాలో నరేశ్‌కు జోడీగా ఆనంది నటించింది. ఈ చిత్రం నవంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని
Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్డేట్...
Vijay: ‘వారిసు’ చిత్ర నిర్మాతకు జంతు సంక్షేమ బోర్డు నోటీసులు..
OTT Movies: ఈ వారం ఓటీటీలో 9 చిత్రాలు.. 6 వెబ్‌సిరీస్‌లు.. అలరించే టాక్ షో!
Kamal Haasan: కమల్‌హాసన్ హెల్త్ అప్డేట్.. ఇంకా ఆస్పత్రిలోనే..!
Mahesh babu: కృష్ణ కన్నుమూత.. మహేశ్‌బాబు తొలి ఎమోషనల్ పోస్ట్.. లవ్యూ నాన్న..!


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!