Kamal Haasan: గురుశిష్యుల కలయిక

అగ్ర దర్శకుడు కె.విశ్వనాథ్‌ (K Viswanath) - ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) మధ్య గురు శిష్యుల బంధం ఉంది. ఈ ఇద్దరి కలయికలో ఎప్పటికీ గుర్తుండిపోయే ‘సాగర సంగమం’, ‘శుభ సంకల్పం’ చిత్రాలొచ్చాయి. తరచూ తన  గురువు కె.విశ్వనాథ్‌ని కలిసి ఆయనతో కాసేపు సమయం గడుపుతుంటారు కమల్‌హాసన్‌. బుధవారం హైదరాబాద్‌కి వచ్చిన ఆయన... కె.విశ్వనాథ్‌ ఇంటికి వెళ్లి కలిశారు. ‘విక్రమ్‌’తో ఇటీవలే విజయాన్ని అందుకున్న కమల్‌హాసన్‌, ప్రస్తుతం ‘భారతీయుడు 2’ చిత్రంలో నటిస్తున్నారు. కెరీర్‌ పరంగా జోరు మీదున్న ఆయన తన గురువు కె.విశ్వనాథ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు.


మరిన్ని