
Waltair Veerayya: బాస్ వచ్చిండు... కిక్ ఇచ్చిండు
బాస్ వచ్చిండు.. కిక్ ఇచ్చిండు... అంటూ సాగే బాస్ పార్టీ పాటతో ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) హంగామా షురూ అయ్యింది. చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రుతిహాసన్ (Shruti Haasan) కథానాయిక. రవితేజ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. బాబీ కొల్లి (కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని ప్రత్యేక గీతం లిరికల్ వీడియోని బుధవారం విడుదల చేశారు. చిరంజీవి, ఊర్వశి రౌతేలాపై తెరకెక్కించిన ఈ గీతాన్ని దేవిశ్రీప్రసాద్ స్వరపరచగా, ఆయనతో కలిసి నకాష్ అజీజ్, హరిప్రియ ఆలపించారు. శేఖర్ నృత్య రీతులు సమకూర్చారు. మాస్ యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రంలో చిరంజీవి మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్ధర్ ఎ.విల్సన్, ప్రొడక్షన్ డిజైనర్: ఎ.ఎస్.ప్రకాష్, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె.చక్రవర్తి రెడ్డి.
మరిన్ని
Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్డేట్...
Vijay: ‘వారిసు’ చిత్ర నిర్మాతకు జంతు సంక్షేమ బోర్డు నోటీసులు..
OTT Movies: ఈ వారం ఓటీటీలో 9 చిత్రాలు.. 6 వెబ్‌సిరీస్‌లు.. అలరించే టాక్ షో!
Kamal Haasan: కమల్‌హాసన్ హెల్త్ అప్డేట్.. ఇంకా ఆస్పత్రిలోనే..!
Mahesh babu: కృష్ణ కన్నుమూత.. మహేశ్‌బాబు తొలి ఎమోషనల్ పోస్ట్.. లవ్యూ నాన్న..!


తాజా వార్తలు (Latest News)
-
India News
Gauhati HC: ‘జీన్స్’తో కోర్టు విచారణకు.. సీనియర్ న్యాయవాదికి ఊహించని అనుభవం!
-
Politics News
Andhra News: కార్పొరేట్ కంపెనీలా వైకాపా వ్యవహరం: సోము వీర్రాజు
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Australia: కనిపించకుండాపోయిన ‘రేడియోధార్మిక’ క్యాప్సూల్.. 1400 కి.మీల మేర వెతుకులాట!
-
India News
PM Modi: అదే మా నినాదం.. అభివృద్ధి మంత్రం: మోదీ