Naga Chaitanya: నాగచైతన్య.. ‘కస్టడీ’

నాగచైతన్య(Naga Chaitanya) - వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) కలయికలో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. ఈ సినిమాకి ‘కస్టడీ’ (Custody) అనే పేరును ఖరారు చేశారు. బుధవారం నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో ఆయన ఎ.శివ అనే పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ప్రచార చిత్రంలో ఆయన్ని చూపించిన తీరును బట్టి.. సినిమాలో శివ తను నమ్మే సిద్ధాంతం కోసం సొంత వ్యవస్థతోనే పోరాటం చేయనున్నాడని అర్థమవుతోంది. ‘‘మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు మీరే అయి ఉండాలి’’ అంటూ వెంకట్‌ ప్రభు ఈ పోస్టర్‌కు జోడించిన వ్యాఖ్య ఆసక్తిరేకెత్తిస్తోంది. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో అరవింద్‌ స్వామి, ప్రియమణి, శరత్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నారు. ఎస్‌.ఆర్‌.కతీర్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు