Kamal Haasan: కమల్‌హాసన్‌ హెల్త్‌ అప్‌డేట్‌.. ఇంకా ఆస్పత్రిలోనే..!

చెన్నై: అగ్రకథానాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, దగ్గుతో ఇబ్బందిపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్‌ సెంటర్‌లో చేరారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశాయి. ప్రస్తుతం కమల్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం మరింత మెరుగుపడిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని ప్రకటించారు.

‘ఇండియన్‌ -2’, ‘బిగ్‌బాస్‌’ పనుల్లో ఫుల్‌ బిజీగా ఉంటున్న కమల్‌ విరామం లేకుండా వరుస షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చి ఆయన తన గురువు, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలిసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ నుంచి చెన్నైకు వెళ్లిన తర్వాత కాస్త అస్వస్థతగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని