
Kantara: ఓటీటీలోకి వచ్చేసిన కాంతార.. ఆ విషయంలో నెటిజన్లు తీవ్ర నిరాశ
ఇంటర్నెట్‌డెస్క్: సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘కాంతార’ (Kantara) ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా భావించే ‘వరాహరూపం’ పాట విషయంలో నెటిజన్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ అసహనాన్ని తెలియజేస్తూ #Varaharoopam హ్యాష్‌ట్యాగ్‌ని జతచేసి వరుస ట్వీట్స్ చేస్తున్నారు. వారు ఇంతలా నిరాశకు గురి కావడానికి కారణం ఏమిటి?
రిషబ్‌శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో ‘కాంతార’ రూపుదిద్దుకుంది. ప్రకృతి - మానవాళి మధ్య సత్సంబంధాలు ఉండాలని తెలియజేస్తూ కర్ణాటకలోని తులునాడు సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమా మొత్తం ఒకెత్తు అయితే ఇందులోని ‘వరాహరూపం’ పాట సినిమాకే హైలైట్‌గా ఉంటుంది. భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లి దేవత ఆవహించిన సమయంలో వచ్చే ఈ పాట ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రిషబ్ నటనకు ఈ పాట తోడు కావడంతో ఆ సన్నివేశాలు అద్భుతంగా పండాయి. అయితే, ఇటీవల ఈ పాటకు కాపీరైట్ సమస్యలు తలెత్తాయి. దీంతో, ‘వరాహరూపం’కు ట్యూన్ మార్చి కొత్త మ్యూజిక్‌తో ఓటీటీలో విడుదల చేశారు.
ఒరిజినల్ ట్యూన్‌కు ప్రస్తుతం ఓటీటీలో వస్తోన్న ట్యూన్‌కు మార్పులు ఉండటంతో సినీ ప్రియులు నిరాశకు గురవుతున్నారు. కొత్త ట్యూన్ బాగోలేదని దయచేసి పాత పాటనే కొనసాగించమంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ‘‘రిషబ్ అన్నా.. ఈ ట్యూన్ ఏం బాలేదు. పాత ట్యూన్ విన్నప్పుడు వచ్చిన ఆ మార్క్ ఇందులో లేదు. దయచేసి ‘వరాహరూపం’ పాత పాటనే కొనసాగించండి’’ అని ట్వీట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి..!
Kantara: ‘కాంతార’కు ఎదురుదెబ్బ.. ఇకపై దాన్ని ప్రదర్శించకూడదు
మరిన్ని
Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్డేట్...
Vijay: ‘వారిసు’ చిత్ర నిర్మాతకు జంతు సంక్షేమ బోర్డు నోటీసులు..
OTT Movies: ఈ వారం ఓటీటీలో 9 చిత్రాలు.. 6 వెబ్‌సిరీస్‌లు.. అలరించే టాక్ షో!
Kamal Haasan: కమల్‌హాసన్ హెల్త్ అప్డేట్.. ఇంకా ఆస్పత్రిలోనే..!
Mahesh babu: కృష్ణ కన్నుమూత.. మహేశ్‌బాబు తొలి ఎమోషనల్ పోస్ట్.. లవ్యూ నాన్న..!


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: కార్పొరేట్ కంపెనీలా వైకాపా వ్యవహరం: సోము వీర్రాజు
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Australia: కనిపించకుండాపోయిన ‘రేడియోధార్మిక’ క్యాప్సూల్.. 1400 కి.మీల మేర వెతుకులాట!
-
India News
PM Modi: అదే మా నినాదం.. అభివృద్ధి మంత్రం: మోదీ
-
General News
Viveka Murder case: మళ్లీ పిలుస్తామన్నారు.. సీబీఐ విచారణకు సహకరిస్తా: అవినాష్‌రెడ్డి