
Remake: మలయాళం సినిమా రీమేక్‌కు సిద్ధమైన టాలీవుడ్ టాప్ హీరో...
హైదరాబాద్: టాలీవుడ్‌లోని అగ్రహీరోల్లో నాగార్జున ఒకరు. కొత్తకాన్సెప్ట్‌లతో సినీప్రియులను అలరించే ఈ టాప్ హీరో ‘ది ఘోస్ట్’(The Ghost) సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని సినిమాలు తీయాలని నిర్ణయించుకొన్నారు. అందుకే ఈసారి మలయాళంలో సూపర్ హిట్ అయిన పొరింజు మరియం జోస్(Porinju Mariam Jose) అనే చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట. 2019 లో విడుదలైన ఈ మలయాళ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఈ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పు చేసి రీమేక్ చేయాలని నాగార్జున అనుకుంటున్నారట.
కొత్త దర్శకులను ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుండే ఈ సీనియర్ స్టార్ హీరో ఈ రీమేక్‌తో మరో ప్రతిభావంతుడిని డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నేను లోకల్, ధమాక చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన ప్రసన్న కుమార్ బెజవాడకు నాగ్ డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఘోస్ట్ తర్వాత ఓటీటీ సినిమాల్లోనూ నటించాలనుకుంటున్నట్లు నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే.
మరిన్ని
Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్డేట్...
Vijay: ‘వారిసు’ చిత్ర నిర్మాతకు జంతు సంక్షేమ బోర్డు నోటీసులు..
OTT Movies: ఈ వారం ఓటీటీలో 9 చిత్రాలు.. 6 వెబ్‌సిరీస్‌లు.. అలరించే టాక్ షో!
Kamal Haasan: కమల్‌హాసన్ హెల్త్ అప్డేట్.. ఇంకా ఆస్పత్రిలోనే..!
Mahesh babu: కృష్ణ కన్నుమూత.. మహేశ్‌బాబు తొలి ఎమోషనల్ పోస్ట్.. లవ్యూ నాన్న..!


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Ram Charan: నాన్న మౌనం వీడితే ఏమవుతుందో తెలీదు: హీరో రామ్‌చరణ్
-
General News
TTD: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు .. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Movies News
Chiranjeevi: ఆ మార్క్ చేరుకోవడం ఆషామాషీ కాదు: చిరంజీవి
-
India News
Gauhati HC: ‘జీన్స్’తో కోర్టు విచారణకు.. సీనియర్ న్యాయవాదికి ఊహించని అనుభవం!
-
Politics News
Andhra News: కార్పొరేట్ కంపెనీలా వైకాపా వ్యవహరం: సోము వీర్రాజు
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా