Mahesh babu: కృష్ణ కన్నుమూత.. మహేశ్‌బాబు తొలి ఎమోషనల్‌ పోస్ట్‌.. లవ్యూ నాన్న..!

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ కృష్ణ మరణం తెలుగు సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది మహేశ్‌బాబు కుటుంబానికి తీరని వేదనను కలిగించింది. సోదరుడు రమేశ్‌బాబు, తల్లి ఇందిర, తండ్రి కృష్ణల మరణాలు ఒకదాని వెంట ఒకటి జరగడంతో మహేశ్‌ మానసికంగా ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. ఇటీవల కన్నుమూసిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ మహేశ్‌బాబు తొలిసారి స్పందించారు. ట్విటర్‌ వేదికగా భావోద్వేగ పోస్ట్‌ చేశారు.

‘‘మీ జీవితం గొప్పగా సాగింది. మీ నిష్క్రమణ కూడా అంతే గొప్పగా జరిగింది. అదంతా మీ గొప్పతనం. తుది శ్వాస వరకూ నిర్భయంగా జీవించారు. ధైర్యం, సాహసం మీ స్వభావాలు. నా స్ఫూర్తి, నా ధైర్యం నేను చూసినదంతా మీతోనే వెళ్లిపోయాయి. అదేంటో, గతంతో పోలిస్తే ఇప్పుడు నేను మరింత దృఢంగా ఉన్నానని అనిపిస్తోంది. ఇప్పుడు నాకెలాంటి భయం లేదు.. మీరు ఎప్పటికీ నాకు అండగా ఉంటారన్న ధైర్యమేమో. మీ ఆశీస్సులు, ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటాయి. మీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తా.. మీరు గర్వపడేలా నడుచుకుంటా. లవ్యూ నాన్న..’’ అని ట్వీట్‌ చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని