OTT Movies: ఈ వారం ఓటీటీలో 9 చిత్రాలు.. 6 వెబ్‌సిరీస్‌లు.. అలరించే టాక్‌ షో!

ఇక చూడటమే తరువాయి..

రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్‌ చిత్రం ‘కాంతార’ (Kantara). ఓటీటీలోకి ఎప్పుడెప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూసిన వారి కల నెరవేరింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. సినీ ప్రియులు మూవీని ఆస్వాదిస్తున్నా, ‘వరాహరూపం’ ఒరిజినల్‌ వెర్షన్‌ లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. తెలుగు, కన్నడ, తమిళ్‌, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.


నవ్వుల ప్రిన్స్‌..

శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు అనుదీప్‌ కె.వి. తెరకెక్కించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ప్రిన్స్‌’. ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో నవంబరు 25 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాతో ఉక్రెయిన్‌ నటి మరియా ర్యాబోషప్క టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.


విభిన్న కథల సమాహారం..

నాని (Nani) వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ పతాకంపై రూపొందిన సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘మీట్‌ క్యూట్‌’ (Meet Cute). ఐదు విభిన్న కథల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌ నవంబరు 25 నుంచి సోనీలివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. సత్యరాజ్‌‌, రోహిణి, అదా శర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహానీ శర్మ, సునైనా, సంచిత, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ వారం సందడి చేయనున్న మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

📽️ద స్విమ్మర్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 23

📽️ గ్లాస్‌ ఆనియన్‌ (హాలీవుడ్) నవంబరు 23

📽️ బ్లడ్‌, సెక్స్‌ అండ్‌ రాయల్టీ (డ్యాకుమెంటరీ సిరీస్‌) నవంబరు 23

📽️ద నోయల్‌ డైరీ (హాలీవుడ్‌) నవంబరు 25

📽️ ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌ (హిందీ/తెలుగు సిరీస్‌) నవంబరు 25

📽️ పడవేట్టు (మలయాళం) నవంబరు 25

📽️ బ్లడ్‌ అండ్‌ వాటర్‌ (ఇంగ్లీష్‌ సిరీస్‌)నవంబరు 25

📽️గిష్‌లైన్‌ మ్యాక్స్‌వెల్‌: ఫిల్తీ రిచ్‌ (ఇంగ్లీష్‌-క్రైమ్‌ డ్యాకుమెంటరీ) నవంvkబు 25

📽️ సోల్‌ బాయ్‌ (ఇంగ్లీష్‌) మూవీ నవంబరు 25

📽️వెన్స్‌డే (వెబ్‌సిరీస్‌) నవంబరు 25


అమెజాన్‌ ప్రైమ్‌

📽️ గుడ్‌ నైట్‌ ఊపీ (మూవీ) నవంబరు 23

📽️ లెన్స్‌ (తమిళ్‌) నవంబరు 25


జీ5

📽️ చుప్‌ (బాలీవుడ్‌) నవంబరు 25


డిస్నీ+హాట్‌స్టార్‌

📽️ ద గార్డియన్‌ ఆఫ్‌ ది గెలాక్సీ హాలిడే స్పెషల్‌ (హాలీవుడ్‌) నవంబరు 25


సోనీ లివ్‌

📽️ గర్ల్స్‌ హాస్టల్‌ (హిందీ సిరీస్‌) నవంబరు 25


ఆహా

📽️ స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (తెలుగు మూవీ) నవంబరు 25

📽️ఎన్‌బీకే అన్‌స్టాపబబుల్‌ (సీజన్‌-2 ఎపిసోడ్‌ 4) నవంబరు 25



మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని