అగ్రనటి జయప్రదకు ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారం

హైదరాబాద్‌: తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సీనియర్‌ నటి జయప్రదకు ఎన్టీఆర్‌ చలన చిత్ర శతాబ్ది పురస్కారం అందించనున్నారు. నందమూరి బాలకృష్ణ గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. ఈ సభలో సినీ నటి జయప్రదకు పురస్కారం అందజేస్తారు. ఈ కార్యక్రమానికి జయప్రకాశ్ నారాయణ, దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి అతిథులుగా విచ్చేయనున్నారు. వీరితో పాటు, మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా, డాక్టర్ మైథిలి అబ్బరాజు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts