
CWG 2022 : 30 కిలోలు తగ్గి కామన్వెల్త్కు
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి బరిలో దిగిన తూలిక మాన్ జూడో మహిళల 78+ విభాగంలో రజతం పట్టేసింది. కానీ ఏడాది క్రితం అసలు ఈ క్రీడలకు ఆమె ఎంపికవడమే సందేహంగా మారింది. ఆమె అధిక బరువే అందుకు కారణం. ఈ క్రీడల కోసం నిరుడు ఎంపిక చేసిన ప్రాబబుల్స్ జాబితాలోనూ తనకు చోటు దక్కలేదు. ఆ దశలో పట్టుదలతో శ్రమించిన ఆమె 30 కిలోలు తగ్గి.. 115 నుంచి 85 కిలోలకు చేరుకుంది. అప్పుడే ఈ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలవాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పుడు రజతం దక్కడంతో నిరాశ వ్యక్తం చేసింది. ‘‘నేను ఇక్కడికి రజతం కోసం రాలేదు. వచ్చే సారి కామన్వెల్త్ క్రీడల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. కానీ నేను పతకం రంగు మార్చాల్సిందే. ఈ ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేను. ఫైనల్లో రెండు తప్పిదాలు చేశా. ఎదురు దాడి చేయలేకపోవడంతో పాటు రక్షణాత్మకంగా వ్యవహరించా. అది ఫలితాన్ని ఇవ్వలేదు. పసిడి కోసమే ఆలోచించా. దాన్ని అందుకోలేకపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నా. ఎన్నో ఇబ్బందులు దాటి ఇక్కడి వరకూ వచ్చా. మరిన్ని శిక్షణ శిబిరాల్లో పాల్గొని ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. 2011లో ఆట నుంచి విరామం తీసుకున్నా. తిరిగి యశ్పాల్ దగ్గరకు వెళ్లడంతో నా ఆట మెరుగైంది. అప్పుడు ఫిట్‌గా లేను. ఇప్పుడూ అలాగే ఉన్నా. అమ్మ, చెల్లి ప్రోత్సాహంతోనే నేనిక్కడ ఉన్నా’’ అని తూలిక చెప్పింది. తన తల్లి దిల్లీలో పోలీస్. ఆమెకు రెండేళ్ల వయసులో తన తండ్రి హత్యకు గురయ్యాడు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (20/08/2022)
-
World News
Cancer Deaths: ధూమపానం వల్లే క్యాన్సర్ మరణాలు అధికం : ది లాన్సెట్
-
India News
Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
-
Sports News
T20 League : భారత టీ20 లీగ్.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్ మాజీ ఆల్‌రౌండర్
-
Movies News
Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
-
World News
Pak on Kashmir: పాకిస్థాన్ ప్రధాని నోట.. శాంతి మాట
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
- Ante sundaraniki: ‘అంటే సుందరానికీ!’ సూపర్ హిట్ ఎందుకు కాలేదంటే..!
- Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
- వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడి అనుమానాస్పద మృతి
- శృంగారానికి పురుషుడి అవసరం లేదు
- Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత
- T20 League : భారత టీ20 లీగ్.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్ మాజీ ఆల్‌రౌండర్
- Pak on Kashmir: పాకిస్థాన్ ప్రధాని నోట.. శాంతి మాట
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (20/08/2022)
- Free mobile: స్మార్ట్‌ఫోన్ ఫ్రీ.. మూడేళ్లు ఇంటర్నెట్ ఫ్రీ.. ఆ రాష్ట్ర సర్కార్ కొత్త స్కీమ్!