ధావన్‌ అకాడమీ ప్రారంభం

దిల్లీ: భారత సీనియర్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ ‘డా వన్‌ స్పోర్ట్స్‌’ పేరిట ఆ అకాడమీని ఏర్పాటు చేశాడు. క్షేత్ర స్థాయిలో క్రీడాకారుల్లో నైపుణ్యాలను కనుగొనడం, వారికి శిక్షణ ఇవ్వడం వాటిపై ఈ అకాడమీ దృష్టి పెడుతుంది. ఎనిమిది క్రీడల్లో దిగువ స్థాయిలో ప్రతిభావంతులను గుర్తించి వారిని సానబడుతుంది. అంతేకాక సుమారు 500 మంది కోచ్‌లకు శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది. ‘‘భారత్‌ వ్యాప్తంగా ఉత్తమ కోచ్‌లను ఎంపిక చేసి డా వన్‌ స్పోర్ట్స్‌ అకాడమీలోని క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ ఇప్పిస్తాం. క్రికెట్‌ నాకెంతో ఇచ్చింది. అందుకే నాకు వీలైనంత వరకు భారత్‌లో క్రీడలకు సాయం చేయాలని అనుకుంటున్నా’’ అని ధావన్‌ పేర్కొన్నాడు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని