SouthAfrica: కారు ప్రమాదంలో కొయిర్జెన్‌ మృతి

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ అంతర్జాతీయ అంపైర్‌ రూడీ కొయిర్జెన్‌ కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. కొయిర్జెన్‌ వయసు 73 ఏళ్లు. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. గోల్ఫ్‌ ఆడి స్వస్థలం కేప్‌టౌన్‌కు తిరిగి వస్తుండగా రూడీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో కొయిర్జెన్‌తో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 1981లో అంపైర్‌గా మారిన రూడీ.. 1992లో దక్షిణాఫ్రికాలో భారత్‌ చరిత్రాత్మక పర్యటనతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2002 నుంచి ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌లో ఉన్న కొయిర్జెన్‌.. 128 టెస్టులు, 250 వన్డేలు, 19 టీ20లకు అంపైర్‌గా వ్యవరించాడు. 2003, 2007 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో టీవీ అంపైర్‌గా పని చేసిన కొయిర్జెన్‌ మొత్తం మూడు వన్డే ప్రపంచకప్‌లలో సేవలందించాడు.


మరిన్ని

ap-districts
ts-districts