Serena Williams: ఆటకు సెరెనా వీడ్కోలు?

న్యూయార్క్‌: టెన్నిస్‌ నుంచి తాను రిటైర్‌కావాలని అనుకుంటున్నానని 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత సెరెనా విలియమ్స్‌ వ్యాఖ్యానించింది. ‘‘రిటైర్మెంట్‌ అన్న పదమే నాకు నచ్చదు. అది ఆధునిక పదంలా ఉండదు. వీడ్కోలు గురించి చాలా రోజులుగా ఆలోచిస్తున్నా. జీవితంలో భిన్న దిశలో ప్రయాణించడానికి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుంది. ఆ సమయంలో చాలా కష్టంగా ఉంటుంది. నా కౌంట్‌డౌన్‌ మొదలైంది’’ అని 40 ఏళ్ల సెరెనా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. యుఎస్‌ ఓపెన్‌ తన చివరి టోర్నీ అని ఆమె సూచన ప్రాయంగా చెప్పింది.


మరిన్ని

ap-districts
ts-districts