జాతి వివక్షను ఎదుర్కొన్నా

వెల్లింగ్టన్‌: తన 16 ఏళ్ల కెరీర్‌లో జాతి వివక్షను ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయని న్యూజిలాండ్‌ మాజీ స్టార్‌ రాస్‌ టేలర్‌ అన్నాడు. ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ పేరుతో రాసిన తన జీవిత చరిత్రలో టేలర్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘మా జట్టులో రంగు దృష్ట్యా నేను కాస్త భిన్నమైన వాడిని. అందుకే కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. తోటి క్రికెటర్ల నుంచే కాదు అభిమానుల నుంచి కూడా కొంత వివక్షను చూశాను. ఒక ఆటగాడు నన్ను ‘నువ్వు సగమే మంచోడివి రాస్‌. కానీ ఆ సగం మంచి ఏమిటో నీకు తెలియదు’ అనేవాడు. ఇదొక్కటే కాదు ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నో విన్నా. నన్నే కాదు నా భార్యను ఉద్దేశించి కూడా కొన్ని జాతి వివక్ష వ్యాఖ్యలు చేసేవాళ్లు. ఇవెంతో బాధను కలిగించేవి. కానీ ఈ విషయాన్ని ప్రశ్నిస్తే పరిస్థితి ఇంకా తీవ్రం అవుతుందని ఆగిపోయేవాడిని. నేను భారత సంతతి లేదా మవోరి జాతికి చెందిన వాడిగా చాలామంది అనుకునేవాళ్లు. ఎందుకంటే న్యూజిలాండ్‌ క్రికెట్లో పసిఫిక్‌ ద్వీపం నుంచి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు అరుదుగా ఉండేవాళ్లు’’ అని టేలర్‌ అన్నాడు.


మరిన్ని

ap-districts
ts-districts