ఉత్తరాఖండ్‌ ప్రచారకర్తగా పంత్‌

డెహ్రాడూన్‌: టీమ్‌ ఇండియా వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌.. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రచారకర్తగా నియమితుడయ్యాడు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చినా.. పట్టుదలతో ప్రపంచ క్రికెట్లో అతడు సాధించిన ఘనతలు ప్రతి ఒక్కరికీ ప్రేరణ అని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి అన్నారు. పంత్‌.. తన రాష్ట్రం, దేశం గర్వపడేలా చేశాడని చెప్పారు. హరిద్వార్‌ జిల్లా (ఉత్తరాఖండ్‌) రూర్కీలో పంత్‌ జన్మించాడు.


మరిన్ని

ap-districts
ts-districts