పుజారా మరో మెరుపు శతకం

హోవ్‌: రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో భారత టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్‌ పుజారా వరుసగా రెండో మెరుపు సెంచరీ బాదాడు. ససెక్స్‌ తరఫున ఆడుతున్న ఈ భారత స్టార్‌.. ఆదివారం సర్రేపై 131 బంతుల్లో 174 పరుగులు చేశాడు. ఇందులో 20 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన ససెక్స్‌.. 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్‌ టామ్‌ క్లార్క్‌ (104)తో కలిసి మూడో వికెట్‌కు చెతేశ్వర్‌ 205 పరుగులు జోడించాడు. 103 బంతుల్లో సెంచరీ చేసిన అతడు... ఆ తర్వాత 28 బంతుల్లోనే 74 పరుగులు రాబట్టాడు. పుజారా, టామ్‌ శతకాలతో ససెక్స్‌ 50 ఓవర్లలో 378/6 స్కోరు చేసింది. ఇంతకుముందు మ్యాచ్‌లో వార్విక్‌షైర్‌పై పుజారా 79 బంతుల్లోనే 107 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని