తెలుగు యోధాస్‌ జోరు

పుణె: అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌ ఆరంభ సీజన్‌లో తెలుగు యోధాస్‌ జోరు కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం స్థానిక శివ్‌ ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 68-47 తేడాతో రాజస్థాన్‌ వారియర్స్‌ను ఓడించింది. ఆదర్శ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట డిఫెన్స్‌లో మూడు నిమిషాల 43 సెకన్ల పాటు ప్రత్యర్థికి దొరకకుండా తప్పించుకున్న అతను.. అనంతరం ఎటాకింగ్‌లో 10 పాయింట్లు సాధించాడు. ప్రసాద్‌ (13), రోహన్‌ (10) కూడా ఎటాకింగ్‌లో రాణించారు. మరో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 54-49తో ఒడిషా జగర్‌నట్స్‌పై విజయం సాధించింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని