రాహుల్‌ 180 స్ట్రైక్‌ రేట్‌తో ఆడగలడు

దిల్లీ: తాను కోల్పోయేదేమీ లేదనుకున్నప్పుడు కేఎల్‌ రాహుల్‌ అత్యుత్తమంగా బ్యాటింగ్‌ చేస్తాడని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ అభిప్రాయపడ్డాడు. దూకుడుగా ఆడలేకపోతున్నందుకు ఇటీవల కాలంలో రాహుల్‌ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాట్సన్‌ స్పందించాడు. ‘‘నా ఫేవరెట్‌ బ్యాటర్లలో రాహుల్‌ ఒకడు. అతడిలో చాలా నైపుణ్యం ఉంది. అత్యుత్తమ బౌలర్ల బౌలింగ్‌లో అన్నివైపులా షాట్లు ఆడగలడు. పెద్దగా సాహసాలు చేయకుండానే 180 స్ట్రైక్‌రేట్‌తో కూడా బ్యాటింగ్‌ చేయగలడు. ఆస్ట్రేలియాలో (ప్రపంచకప్‌లో) అలా చేయగలిగితే చాలా మంది బౌలర్లు ఇబ్బంది పడతారు’’ అని వాట్సన్‌ అన్నాడు. పేస్‌ బౌలింగే ప్రస్తుతం భారత్‌ బలహీనతగా కనిపిస్తోందని చెప్పాడు. ‘‘భారత జట్టు బ్యాటింగ్‌ బాగుంది. కానీ ఆ జట్టు ఫాస్ట్‌బౌలింగ్‌పైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్షర్‌, చాహల్‌ మంచి స్పిన్నర్లు. కానీ బుమ్రా లేని ఫాస్ట్‌బౌలింగ్‌ ఒత్తిడిలో రాణించగలుగుతుందా అన్నది చూడాలి’’ అని వాట్సన్‌ అన్నాడు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు