ఇంగ్లాండ్‌దే టీ20 సిరీస్‌

ఏడో మ్యాచ్‌లో పాక్‌ చిత్తు

లాహోర్‌: డేవిడ్‌ మలన్‌ (78 నాటౌట్‌; 47 బంతుల్లో 8×4, 3×6) మెరుపులు మెరిపించడంతో పాకిస్థాన్‌తో ఏడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లాండ్‌ సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక ఏడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 67 పరుగుల తేడాతో ఆతిథ్య పాక్‌ను చిత్తుచేసింది. 17 ఏళ్ల తర్వాత పాక్‌లో పర్యటించిన ఇంగ్లాండ్‌ 4-3తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదట ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగుల భారీస్కోరు సాధించింది. మలన్‌తో పాటు బెన్‌ డకెట్‌ (30; 19 బంతుల్లో 3×4, 1×6), హ్యారీ బ్రూక్‌ (46 నాటౌట్‌; 29 బంతుల్లో 1×4, 4×6) రాణించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మలన్‌.. బ్రూక్‌తో నాలుగో వికెట్‌కు అజేయంగా 108 పరుగులు జోడించాడు. అనంతరం పాక్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (4), మహ్మద్‌ రిజ్వాన్‌ (1) ఆరంభంలోనే ఔటవగా.. షాన్‌ మసూద్‌ (56; 43 బంతుల్లో 4×4, 1×6) ఒంటరి పోరాటం చేశాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ (3/26), రీస్‌ టాప్లీ (1/34), డేవిడ్‌ విల్లీ (2/22), ఆదిల్‌ రషీద్‌ (1/25), సామ్‌ కరన్‌ (1/27) రాణించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని