మెరిసిన మేఘన

మలేసియాపై భారత్‌ విజయం

మహిళల ఆసియా కప్‌

సిల్‌హట్‌: ఓపెనర్‌ సబ్బినేని మేఘన (69; 53 బంతుల్లో 11×4, 1×6) సత్తా చాటడంతో మహిళల ఆసియాకప్‌లో భారత్‌ వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 30 పరుగుల తేడాతో మలేసియాను ఓడించింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు సాధించింది. మేఘన మెరుపులకు తోడు ఫామ్‌ అందుకున్న షెఫాలివర్మ (46; 39 బంతుల్లో 1×4, 3×6) కూడా రాణించడంతో భారత్‌కు శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు మేఘన-షెఫాలి 116 పరుగులు జోడించారు. మేఘన, షెఫాలి ఔటైనా.. రిచా ఘోష్‌ (33 నాటౌట్‌; 19 బంతుల్లో 5×4, 1×6) ధాటిగా ఆడడంతో భారత్‌ భారీ స్కోరు సాధించింది. ఛేదనలో వర్షం కారణంగా ఆట ఆగిపోయే సమయానికి మలేసియా 5.2 ఓవర్లలో 16/2తో నిలిచింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం అప్పటికి మలేసియా 46 పరుగులు చేస్తే గెలిచేది. కానీ ఆ స్కోరుకు చాలా దూరంలో ఉండడంతో భారత్‌ విజయాన్ని అందుకుంది. టీమ్‌ఇండియా బౌలర్లలో దీప్తిశర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. హర్మన్‌ప్రీత్‌ బృందం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్‌ గెలిచిన సంగతి తెలిసిందే.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని