స్పెయిన్‌ గోల్స్‌ మోత

కోస్టారికాపై 7-0తో ఘనవిజయం

మాజీ ఛాంపియన్‌ స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఘనంగా బోణీ కొట్టింది. బుధవారం జరిగిన గ్రూప్‌-ఈ మ్యాచ్‌లో గోల్స్‌ వాన కురిపిస్తూ ఆ జట్టు 7-0తో కోస్టారికాను చిత్తుగా ఓడించింది. ఏకపక్షంగా సాగిన పోరులో స్పెయిన్‌ ఆద్యంతం తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అత్యంత పేలవ ప్రదర్శన చేసిన కోస్టారికా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆ జట్టుకు బంతి దొరకడమే కష్టమైపోయింది. కోస్టారికా ఏ దశలోనూ గోల్‌ చేసేట్లు కనపడలేదు. బంతి 81 శాతం స్పెయిన్‌ నియంత్రణలో ఉంది. డానీ ఆల్మో 11వ నిమిషంలో గోల్‌తో ఖాతా తెరిచిన స్పెయిన్‌.. 21వ నిమిషంలో అసెన్సియో గోల్‌తో 2-0 ఆధిక్యంలో వెళ్లింది. ఆ తర్వాత ఫెరన్‌ టోరెస్‌ రెండు గోల్స్‌ (31వ, 54వ) కొట్టి ఆ జట్టును తిరుగులేని స్థితిలో నిలిపాడు. ఆ తర్వాత గావి (74వ), సోలర్‌ (90వ), మొరాటా (90+2) తలో గోల్‌ కొట్టడంతో స్పెయిన్‌ ఘనవిజయాన్ని అందుకుంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని