హైకోర్టు న్యాయమూర్తిగా సి.వి.భాస్కర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా చాడ విజయ భాస్కర్‌రెడ్డి గురువారం ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. మొదటి కోర్టు హాలులో ఉదయం ఆయనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి జారీ చేసిన నియామక ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్‌ చదివి వినిపించారు. అనంతరం ఆయన దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులతో పాటు బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, భాస్కర్‌రెడ్డి కుటుంబసభ్యులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనంలో జస్టిస్‌ భాస్కర్‌రెడ్డి విధులు నిర్వహించారు. సాయంత్రం హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.రఘునాథ్‌ ఆధ్వర్యంలో జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డికి సన్మానం జరిగింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని