
ఎమ్మెస్సీలో మెడికల్ ఫిజిక్స్ కోర్సు
అందుబాటులోకి తెస్తున్న ఐఐటీహెచ్
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రితో కలిసి రూపకల్పన
ఈనాడు, సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్ మరో కొత్త కోర్సును అందుబాటులోకి తెస్తోంది. మూడేళ్ల కాలవ్యవధితో ఎమ్మెస్సీలో మెడికల్ ఫిజిక్స్ పూర్తి చేసే అవకాశం కల్పిస్తోంది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రితో కలిసి ఈ కోర్సుకు రూపకల్పన చేసింది. రెండేళ్లపాటు ఐఐటీలోని ఆచార్యుల పర్యవేక్షణలో విద్యార్థులు వివిధ అంశాలను నేర్చుకుంటారు. మూడో ఏడాది బసవతారకం ఆసుపత్రిలో నిష్ణాతులైన వైద్యబృందంతో కలిసి పనిచేస్తారు. ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సులో చేరడానికి అర్హులు. మార్కుల ఆధారంగా అర్హులు ఎంపిక చేస్తారు. అప్లయిడ్ ఫిజిక్స్‌ను ఉపయోగించి వివిధ రకాల రోగాలకు సంబంధించి నివారణ, నిర్ధారణ, చికిత్సలు, ఆవిష్కరణల రూపకల్పన నైపుణ్యాలను ఈ కోర్సుతో సంపాదించవచ్చని తెలిపింది.
ఏఈఆర్బీ అనుమతితో...!
ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ) నుంచి ఈ కోర్సుకు అనుమతి లభించింది. ఈ కోర్సులో భాగంగా రేడియేషన్ ఫిజిక్స్, క్లినికల్ లెక్చర్స్, స్వల్పకాలిక ప్రాజెక్టులు తదితర అంశాలుంటాయి. వైద్యరంగంలో ఒక సంస్థతో కలిసి వినూత్నంగా దీనిని అందుబాటులోకి తెస్తున్నారు. ‘వైద్యరంగంలో మేం ప్రవేశపెడుతున్న మూడో కోర్సు ఇది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడుతుంది’ అని ఐఐటీ హైదరాబాద్ సంచాలకులు ఆచార్య బీఎస్ మూర్తి వివరించారు. ప్రవేశాలు, ఇతర సమాచారాన్ని https://cip.iith.ac.in/ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Ashwini Dutt: ఆ సినిమా చేసి నేనూ అరవింద్ రూ. 12 కోట్లు నష్టపోయాం: అశ్వనీదత్
-
Sports News
Rishabh Pant: రిషభ్ పంత్‌కు కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ నటి..
-
India News
Smoking in Plane: సిగరెట్ కాల్చింది డమ్మీ విమానంలోనట.. బాబీ కటారియా వింత వాదన
-
Politics News
Nitish Kumar: ‘నాకు ఆ ఆలోచన లేదు’: చేతులు జోడించి మరీ స్పష్టం చేసిన నీతీశ్
-
Movies News
Macherla Niyojakavargam Review: రివ్యూ: మాచర్ల నియోజకవర్గం
-
General News
Vijayawada: కృష్ణా నదికి పోటెత్తిన వరద.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్‌లో నల్లగా మారిపోయిన ఇసుక..
- Hyderabad News: నాన్నను బతికించుకొనేందుకు ఆస్తులమ్మి.. షేర్లలో పెట్టి ఆత్మహత్య
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- AP Govt: మరో బాదుడు
- Dilraju: ‘దిల్ రాజు గారూ’ మా బాధ వినండి.. 36వేల ట్వీట్స్..!
- TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..