భూగర్భ జలమట్టంలో తెలంగాణ భేష్‌

లోక్‌సభలో వెల్లడించిన కేంద్రం

ఈనాడు, హైదారాబాద్‌: గడిచిన పదేళ్ల కాలంలో రాష్ట్రంలో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. పెరుగుదల నమోదైన కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉండగా, దేశంలోని 53 ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌ మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలో భూగర్భ జలమట్టం పెరిగిన తీరుపై లోక్‌సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు సమాధానాలు ఇచ్చారు. బావుల్లో మట్టం పెరిగిన తీరును ఉదాహరించారు.

భూగర్భ జలాలను పరిశీలించడంలో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కలిపి 2011 నుంచి 2020 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఆ కాల వ్యవధిలో తెలంగాణలో 537 బావుల్లో జలమట్టాన్ని గణించగా 450(85%) బావుల్లో 4 మీటర్లకు మించి పైకి వచ్చింది.

దేశంలోని 53 ప్రధాన నగరాల్లోని బావుల్లో నీటి మట్టాన్ని లెక్కించగా హైదరాబాద్‌, మధురై, కొజికోడ్‌ నగరాల్లో 91.7 శాతం వృద్ధి నమోదయింది. హైదరాబాద్‌ నగరంలో 36 బావులను పరిశీలించగా 33 బావుల్లో నాలుగు మీటర్లకు మించి మట్టం పెరిగింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని