నల్సార్‌ వీసీ హోదాలో వి.బాలకిష్టారెడ్డి

ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: నల్సార్‌ యూనివర్సిటీకి వైస్‌ఛాన్సలర్‌ హోదాలో ప్రస్తుత రిజిస్ట్రార్‌ వి.బాలకిష్టారెడ్డిని నియమిస్తూ ఛాన్సలర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వైస్‌ఛాన్సలర్‌గా ఉన్న ఫైజాన్‌ ముస్తఫా పదవీ కాలం జులై 31తో ముగియడంతో ఆగస్టు 1 నుంచి వీసీ బాధ్యతలు నిర్వహించడానికి ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డిని వీసీ హోదాలో నియమిస్తూ ఛాన్సలర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ నియామక ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ నల్సార్‌ యూనివర్సిటీకి పంపారు. వీసీ పదవి భర్తీ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. ఈ పోస్టు కోసం ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డితో పాటు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ప్రొఫెసర్‌ ఫైజాన్‌ ముస్తాఫా కూడా పదవీ కాలం పొడిగింపు కోసం ప్రయత్నాలు చేశారు. కమిటీ ఇప్పటికే మూడు పేర్లను వీసీ పోస్టు కోసం సిఫారసు చేసినట్లు తెలిసింది. నియామక ప్రక్రియలో జాప్యం కారణంగా తాత్కాలిక ఏర్పాట్ల కింద ప్రస్తుతం నల్సార్‌ రిజిస్ట్రార్‌గా ఉన్న వి.బాలకిష్టారెడ్డికి వీసీ హోదా కల్పిస్తూ ఛాన్సలర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని