వీఆర్‌వోల సర్దుబాటులో స్పష్టత లేదు

జీవో 121 రద్దయ్యే వరకు పోరాటం: లచ్చిరెడ్డి

వికారాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం వీఆర్‌వోలను ఇతర శాఖలకు సర్దుబాటు చేయడంలో స్పష్టత లేదని తహసీల్దార్ల అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి అన్నారు. గురువారం ఇక్కడి అంబేడ్కర్‌ భవనంలో ఆయన వీఆర్‌వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసి ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అవినీతిపరులనే ముద్రవేసి వీఆర్‌వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తున్నారని పేర్కొన్నారు. సీనియార్టీ పద్ధతిలో కాకుండా లాటరీ విధానంలో వేరే శాఖల్లోకి పంపించడం ఏమిటని ప్రశ్నించారు. కనీసం సర్వీసును పరిగణనలోకి తీసుకుంటారో లేదో స్పష్టతలేదని విమర్శించారు. జీవో 121ను రద్దు చేసేవరకు, సమస్యల పరిష్కారమయ్యే వరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని