ఒక్క జడ వేసుకున్నందుకు శిక్ష

ఒక్కొక్కరితో 200 గుంజీలు తీయించిన పీఈటీ
విధుల నుంచి పీఈటీని తొలగించిన కలెక్టర్‌

జడ్చర్ల గ్రామీణం, జడ్చర్ల పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థినుల్లో కొందరు రెండు జడలకు బదులు ఒకటే వేసుకున్నారని, మరికొందరు ప్రార్థనకు గైర్హాజరయ్యారని ఆగ్రహించిన పీఈటీ శ్వేత ఒక్కో విద్యార్థినితో 200 గుంజీలు తీయించారు. తమ పిల్లలు అస్వస్థతకు గురైన నేపథ్యంలో తల్లిదండ్రుల సిబ్బందిని నిలదీయడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం జరిగిన దారుణం గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పలువురి కాళ్లకు వాపులు రావడంతోపాటు నడవలేని స్థితికి చేరుకున్నారు. తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యుడు శివకాంత్‌ గురువారం విద్యార్థినులను పరీక్షించారు. నొప్పులతో కొందరికి జ్వరం వచ్చినట్టు, కొందరు స్పృహతప్పి పడిపోయినట్టు గుర్తించిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురైన 25 మందిని బాదేపల్లి కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఎన్‌ఎస్‌యూఐ సహా పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలకు ఉపక్రమించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పీఈటీని విధుల నుంచి  తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని